Bandi Sanjay: 1,400 మందికి అగ్గిపెట్టె దొరికితే... హరీశ్ రావుకి మాత్రం దొరకలేదు: బండి సంజ‌య్

bandi sanjay slams harish rao
  • సిద్ధిపేటకు కేంద్రం నుంచి 138 కోట్ల రూపాయ‌లు మంజూరు
  • 2,977 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌కు నిధులు
  • ఆ నిధులను హరీశ్‌ రావు ఏం చేశారో చెప్పాలి
తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న హ‌రీశ్ రావుకు అగ్గిపెట్టె మాత్రం ఎందుకు దొర‌క‌లేద‌ని బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మరోసారి ప్ర‌శ్నించారు. ఉద్యమ సమయంలో 1,400 మందికి అగ్గిపెట్టె దొరికింద‌ని, హరీశ్‌ రావుకి మాత్రం అంది దొరకలేదా? అని విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో హ‌రీశ్ రావు చేస్తోన్న వ్యాఖ్య‌ల‌పై బండి సంజ‌య్ చుర‌క‌లంటించారు. కన్నతల్లికి తిండి పెట్టని వ్య‌క్తి పినతల్లి కి బంగారు గాజులు చేయిస్తాన‌న్నాడ‌ట అని వ్యాఖ్యానించారు. సిద్ధిపేటకు 138 కోట్ల రూపాయ‌ల‌తో కేంద్ర ప్ర‌భుత్వం 2,977 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను మంజూరు చేసిందని ఆయ‌న తెలిపారు.

అయితే, ఆ నిధులను హరీశ్‌ రావు ఏం చేశారో చెప్పాలని ఆయ‌న నిల‌దీశారు. అభివృద్ధి జ‌ర‌గాలంటే కేంద్రం నుండి నిధులు ఇచ్చే పార్టీకి ఓటేయాల‌ని అన్నారు. అభివృద్ధి ప‌నుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం నిధులను మంజూరు చేస్తే వాటి పేర్ల‌ను మార్చుతూ తామే చేసినట్లు  టీఆర్ఎస్ చెప్పుకుంటుందని ఆయన విమ‌ర్శించారు.
Bandi Sanjay
BJP
Harish Rao

More Telugu News