Pooja Hegde: హీరోయిన్ పూజ హెగ్డేకు క‌రోనా నిర్ధార‌ణ‌

puja hegde tests positive for corona
  • హోం ఐసోలేషన్‌లో హీరోయిన్
  • త‌న‌ను కలిసిన వారందరూ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచ‌న‌
  • తాను ఆరోగ్యంగానే ఉన్నానని వెల్ల‌డి
సినీ ప‌రిశ్ర‌మ‌ను క‌రోనా వ‌ణికిస్తోంది. హీరోయిన్‌ పూజ హెగ్డేకు కూడా క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని ఆమె సామాజిక మాధ్య‌మాల ద్వారా తెలిపింది. తాను క‌రోనా ప‌రీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింద‌ని ఆమె చెప్పింది. తాను  ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని చెప్పింది. ఇటీవ‌లి కాలంలో త‌న‌ను కలిసిన వారందరూ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని తెలిపింది.

ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, అభిమానుల‌ ప్రేమాభిమానాలకు థ్యాంక్స్ చెబుతున్నాన‌ని పేర్కొంది. క‌రోనా విజృంభిస్తోన్న వేళ అందరూ ఇళ్ల‌లోనే జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉండాలని ఆమె కోరింది. ప్ర‌స్తుతం పూజ హెగ్డే ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. కాగా, సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇప్ప‌టికే చాలా మంది క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే.
Pooja Hegde
Tollywood
Corona Virus

More Telugu News