Jogu Ramanna: రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లపై ఎమ్మెల్యే జోగు రామన్న, రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ మధ్య వాగ్వాదం!

War of words between MLA Jogu Ramanna and RIMS Director Balaram Naik
  • ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కొవిడ్ పై రివ్యూ
  • రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్ కు తరలిపోయాయంటూ ఆరోపణలు
  • ఖండించిన రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్
  • ఇంజెక్షన్లు ఇవ్వలేదని ఎమ్మెల్యే కక్షకట్టారని ఆరోపణ
  • తాను ఎవరికీ రికమెండ్ చేయలేదన్న జోగు రామన్న

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ కార్యాలయంలో కొవిడ్ సమీక్ష సమావేశం నిర్వహించగా, ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల లెక్కల్లో తేడాపై ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు విసురుకున్నారు.

రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కోసం రాజకీయ పైరవీలు ఎక్కువయ్యాయని రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజెక్షన్లు ఇవ్వలేదని ఎమ్మెల్యే జోగు రామన్న తనపై కక్ష కట్టారని, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్ కు ఎక్కడ తరలిపోయాయో ఆధారాలు చూపించాలని బలరాం నాయక్ అన్నారు. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పందిస్తూ, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కోసం తాను ఎవరికీ రికమెండ్ చేయలేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News