Jagan: నూతన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

CM Jagan wishes Justice NV Ramana on being sworn as new CJI
  • సుప్రీంకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి
  • 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ
  • రమణపై శుభాకాంక్షల వెల్లువ
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ సీఎం
  • న్యాయ వ్యవస్థ గౌరవాన్ని పెంచాలంటూ గవర్నర్ ఆకాంక్ష

సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్ గా పదవీప్రమాణం చేసిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ సీఎం జగన్ కూడా జస్టిస్ ఎన్వీ రమణకు విషెస్ తెలియజేశారు. 'భారత చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేస్తున్న ఎన్వీ రమణ గారికి శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు.

అంతకుముందు, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. "మీ చారిత్రాత్మక తీర్పుల ద్వారా భారత న్యాయ వ్యవస్థ గౌరవాన్ని, హుందాతనాన్ని మరింత విస్తరింప చేస్తారని ఆశిస్తున్నాను. ఈ క్రమంలో మీపై పూరీ జగన్నాథ్, తిరుమల వెంకటేశ్వరుడి కరుణా కటాక్షాలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కూడా శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News