KCR: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

CM KCR congratulates CJI NV Ramana
  • సీజేఐగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్వీ రమణ
  • మీ అనుభవం దేశానికి ప్రయోజనకరమన్న కేసీఆర్
  • మీ పదవీకాలం గొప్పగా ఉండాలని ఆకాంక్ష
ప్రతి తెలుగువాడు ఈరోజు అత్యంత గర్వించదగ్గ రోజు. మన తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పదవీ బాధ్యతలను స్వీకరించారు. భారత రాష్ట్రపతి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీతో పాటు అతి కొద్ది మంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మరోవైపు సీజేఐగా బాధ్యతలను స్వీకరించిన జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత సర్వోన్నత న్యాయస్థానం 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను చేపట్టినందుకు శుభాకాంక్షలు అని కేసీఆర్ అన్నారు. మీకున్న విశేషమైన అనుభవం దేశానికి ఎంతో ప్రయోజనకరమని చెప్పారు. మీ పదవీకాలం చాలా గొప్పగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
KCR
TRS
Justice Ramana
Supreme Court

More Telugu News