Chiranjeevi: జస్టిస్‌ ఎన్వీ రమణకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్ష‌లు

 NVRamana garu as he takes oath as Honble Chief Justice of India
  • వ్యవసాయ కుటుంబంలో జ‌న్మించార‌న్న చిరు
  • విద్యార్థి దశ నుంచే రైతుల పక్షాన నిలిచి పోరాడార‌ని ప్ర‌శంస‌
  •  సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయుడని వ్యాఖ్య‌
సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయించిన విష‌యం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జస్టిస్‌ రమణకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు.

'మన తెలుగు తేజం ఎన్‌వీ రమణగారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి శుభాభినందనలు' అని ఆయ‌న పేర్కొన్నారు. ఆయ‌న‌ వ్యవసాయ కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుంచే రైతుల పక్షాన నిలిచి పోరాడిన రైతు బిడ్డ అని చిరంజీవి గుర్తు చేశారు. ఆయ‌న‌ సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయుడని, గత 40 ఏళ్లుగా న్యాయ క్షేత్రంలో నిత్య కృషీవలుడని ప్రశంసించారు.

            
Chiranjeevi
nv ramana
Supreme Court

More Telugu News