Prabhas: ప్రభాస్ చాలా సింపుల్: శ్రుతి హసన్

Suthi Haasan said Prabhas is very simple
  • ప్రభాస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు
  • స్టార్ స్టేటస్ ను పక్కన పెట్టేస్తారు  
  • ఆయన సెట్లో ఉంటే సందడే సందడి
ప్రభాస్ కథానాయకుడిగా 'సలార్' సినిమా రూపొందుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా ఇది నిర్మితమవుతోంది. దాంతో ఈ సినిమాలో కథానాయికగా అవకాశాన్ని దక్కించుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. చివరికి అదృష్టం శ్రుతిహసన్ ను వరించింది. కొంతకాలంగా చెప్పుకోదగిన సక్సెస్ గ్రాఫ్ లేని శ్రుతి, జోరుమీదున్న హీరోయిన్లను పక్కకి నెట్టేసి అవకాశాన్ని కొట్టేయడం గొప్ప విషయం. రీసెంట్ గా జరిగిన షెడ్యూల్లో ఈ ఇద్దరి కాంబినేషన్లో కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు.

ప్రభాస్ జోడీగా శ్రుతిహసన్ చేస్తున్న తొలిసినిమా ఇది. సెట్లో ఈ ఇద్దరూ కలుసుకోవడం కూడా ఇదే మొదటిసారి. ప్రభాస్ తో కలిసి నటించిన శ్రుతి మాట్లాడుతూ ... "ప్రభాస్ చాలా సింపుల్ .. అంతటి క్రేజ్ ఉన్న ఆయన అంత సింపుల్ గా ఉంటారని నేను అనుకోలేదు. ఆయన చాలా ప్రేమతో మాట్లాడతారు .. సెట్లోని అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రభాస్ సెట్లో ఉన్నంత సేపు అక్కడి వాతావరణం సందడిగా ఉంటుంది. తాను ఒక పెద్ద స్టార్ ను అనే విషయాన్ని ఆయన పూర్తిగా పక్కన పెట్టేస్తారు. ఆయనతో కలిసి నటించడం ఎవరికైనా కంఫర్ట్ గానే ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చింది.
Prabhas
Sruthi Haasan
Prashanth Neel

More Telugu News