Mahesh Babu: త్రివిక్రమ్ .. మహేశ్ ప్రాజెక్టు మొదలయ్యేది ఆ రోజునే!

Mahesh Babu new project is going to start on Krishna Birthday
  • వాయిదాపడిన 'సర్కారువారి పాట' షూటింగ్
  • త్రివిక్రమ్ తో సినిమాకి సన్నాహాలు
  • మే 31వ తేదీ కోసం అభిమానుల వెయిటింగ్  
మహేశ్ బాబు అభిమానులంతా ఇప్పుడు రెండు విషయాలపై దృష్టి పెట్టారు. ఒకటి .. 'సర్కారువారి పాట' రిలీజ్ డేట్. రెండవది త్రివిక్రమ్ తో ఆయన చేయనున్న సినిమా మొదలయ్యే రోజు. పరశురామ్ తో కలిసి మహేశ్ తన సినిమాను చకచకా లాగించేస్తూనే ఉన్నాడు. అయితే కరోనా కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగును ఆపేయవలసి వచ్చింది. పరిస్థితులు అనుకూలించగానే తిరిగి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సంక్రాంతికి ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

మరోపక్క, త్రివిక్రమ్ - మహేశ్ బాబు ప్రాజెక్టును లాంచ్ చేయడానికి ముహూర్తం ఖాయమైపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మే 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు .. అందువలన ఆ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. కరోనా కారణంగా చాలా సింపుల్ గా ఈ కార్యక్రమాన్ని జరపనున్నట్టు తెలుస్తోంది. ఇక అదే రోజున 'సర్కారువారి పాట' నుంచి మహేశ్ బాబు ఫస్టులుక్ రానుందని అంటున్నారు. మొత్తానికి కృష్ణ పుట్టిన రోజున మహేశ్ బాబు అభిమానులకు రెండు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఉన్నాయన్న మాట.  
Mahesh Babu
Trivikram Srinivas
Krishna

More Telugu News