Telangana: రోజాకు ఫోన్ చేసి పరామర్శించిన తెలంగాణ సీఎం కేసీఆర్

Telangana CM KCR Called To YCP Leader Roja
  • నెల రోజుల క్రితం రోజాకు శస్త్రచికిత్స
  • ప్రస్తుతం చెన్నైలో విశ్రాంతి
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కేసీఆర్
శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. నిన్న ఆమెకు ఫోన్ చేసిన సీఎం.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు.

కాగా, నెల రోజుల క్రితం రోజా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆక్కడామెకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం చెన్నైలోని తన నివాసంలో రోజా విశ్రాంతి తీసుకుంటున్నారు.
Telangana
KCR
RK Roja
YSRCP

More Telugu News