: శ్రీనివాసన్ కొనసాగితే 'నో స్పాన్సర్ షిప్' అంటోన్న సహారా
బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్. శ్రీనివాసన్ కొనసాగితే తాము టీమిండియా స్పాన్సర్ షిప్ విషయమై పునరాలోచించుకోవాల్సి ఉంటుందని సహారా ఇండియా చైర్మన్ సుబ్రతా రాయ్ హెచ్చరించారు. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాయ్ స్పందించారు. నైతిక బాధ్యత వహిస్తూ శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. శ్రీనివాసన్ కు పాలన వ్యవహారాలు బొత్తిగా తెలియవంటూ, శశాంక్ మనోహర్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీసీసీఐతో తమ సఖ్యత సజావుగా సాగిందని ఆయన చెప్పుకొచ్చారు.
రెండ్రోజుల క్రితం సహారా యాజమాన్యంలో ఉన్న పుణే వారియర్స్ ఇండియా ఫ్రాంచైజీ బకాయిలు చెల్లించలేక ఐపీఎల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. సకాలంలో నగదు చెల్లించకపోవడంతో, బీసీసీఐ.. పుణే ఫ్రాంచైజీ బ్యాంకు ష్యూరిటీని జప్తు చేయాలని నిర్ణయించింది.