Rains: ఉపరితల ఆవర్తన ప్రభావం... తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Rain alert for AP and Telangana
  • 1.5 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం
  • దక్షిణ ఒడిశా, పరిసర ప్రాంతాలపై ఆవర్తనం
  • ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు
  • తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
  • తెలంగాణకు నాలుగు రోజుల వర్ష సూచన
దక్షిణ ఒడిశా, సమీప ప్రాంతాల్లో సముద్ర మట్టానికి ఒకటిన్నర కిలోమీటరు ఎత్తున ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమలోను...  నేడు, రేపు ఉత్తర కోస్తా, యానాంలోను... ఎల్లుండి ఉత్తర కోస్తాలోను వర్షాలు పడతాయని వివరించింది.

అటు, తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు వడగళ్లతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ మధ్య మహరాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి ఎగువన 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కారణంగా తేలికపాటి ఉంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

కాగా, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షాలు ఉపశమనమే అయినా, రైతన్నకు మాత్రం కష్టాలు మిగుల్చుతున్నాయి. రైతులు అకాల వర్షాలతో పంటలు నష్టపోతున్నారు.
Rains
Andhra Pradesh
Telangana
Trough

More Telugu News