USA: ఆసియన్​ అమెరికన్లపై దాడుల నిరోధ బిల్లుకు అమెరికా సెనేట్​ ఆమోదం

US Senate Passes bill against the hate crimes on Asian Americans
  • 94–1 తేడాతో పాసైన బిల్లు
  • వచ్చే నెలలో చట్టంగా మారే అవకాశం
  • ఇకపై విద్వేష నేరాలను విచారించనున్న న్యాయ శాఖ

ఇటీవలి కాలంలో అమెరికాలో ఆసియన్లపై దాడులు పెరిగిపోతుండడంతో ఆ దేశం చర్యలకు ఉపక్రమించింది. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. మార్చి 16న అట్లాంటా కాల్పుల ఘటన తర్వాత అమెరికా ఆ సమస్యపై మరింత దృష్టి సారించింది. అందులో భాగంగానే ఆసియన్ అమెరికన్లపై దాడులను నిరోధించేందుకు ఓ బిల్లును రూపొందించింది.

గురువారం సెనేట్ లో ఆ బిల్లును ప్రవేశపెట్టగా దాదాపు సెనేటర్లంతా దానికి ఆమోదం తెలిపారు. 94–1 ఓట్ల తేడాతో ఆ బిల్లు ఆమోదం పొందింది. బిల్లు వచ్చేనెలలో చట్టంగా మారుతుందని సమాచారం. చట్టం ప్రకారం విద్వేష ఘటనలపై న్యాయ శాఖ స్వతంత్ర విచారణ జరపనుంది. ఘటన జరిగిన వెంటనే అటార్నీ జనరల్.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గనిర్దేశకులుగా ఉంటారు.

చట్టం అమలు, ఆన్ లైన్ లో నేరాల రిపోర్టింగ్, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. కాగా, 2019 నుంచి 2020 మధ్య అమెరికాలోని 16 పెద్ద నగరాల్లో ఆసియన్ అమెరికన్లపై విద్వేష ఘటనలు 149 శాతం పెరిగినట్టు కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నివేదిక చెబుతోంది.

  • Loading...

More Telugu News