లాభాపేక్ష లేకుండా భారత్‌కు టీకాలు అందజేస్తాం: ఫైజర్
- ప్రభుత్వ ఒప్పందాల ద్వారా అందిస్తామన్న సంస్థ
- కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడి
- అందరికీ టీకా అందించడమే లక్ష్యమన్న సంస్థ
- విదేశీ టీకాలకు అనుమతి ఇచ్చేందుకు కేంద్రం యోచన
దేశంలో కరోనా ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని టీకా అవసరాల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఇతర దేశాల్లో ఆమోదం పొందిన సమర్థమైన టీకాలను భారత్‌లో కూడా అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పలు సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేసుకున్నాయి. ఇప్పటివరకు దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు మాత్రమే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. రష్యాకు చెందిన స్పుత్నిక్-వి టీకాకు ఆమోదం లభించినప్పటికీ.. ఇంకా వినియోగంలోకి రాలేదు.