Alok Sharma: కరోనా బాధితుల మృతదేహాలు తరలించే వాహనాల ముందు బీజేపీ ఎంపీ ఫొటోలకు పోజులు!

BJP MP poses in front of Mukti Vahan in Bhopal
  • దేశంలో కరోనా విలయతాండవం
  • పెద్ద సంఖ్యలో మరణాలు
  • భోపాల్ ఎంపీ అనుచిత వైఖరి
  • ముక్తి వాహనాల ముందు ఫొటో షూట్
  • సర్వత్రా విమర్శలు

కరోనా కష్టకాలంలో రోగులు, వారి కుటుంబ సభ్యుల ఆందోళన అంతాఇంతా కాదు. కరోనాతో మరణిస్తే కనీసం కడసారి చూపులు కూడా కష్టమే అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఎంపీ ప్రవర్తించిన తీరు సర్వత్రా ఆగ్రహం కలిగించింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ ఎంపీ అలోక్ శర్మ కరోనా బాధితుల మృతదేహాలను శ్మశానానికి తరలించే ముక్తి వాహనం ముందు నిలబడి ఫొటోలకు పోజులిచ్చారు. ఎంపీ ఫొటో షూట్ కోసం ముక్తి వాహనాలను చాలాసేపు నిలిపివేశారు. దీనిపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత నరేంద్ర సలూజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అలోక్ శర్మ నీచంగా వ్యవహరించాడని, సిగ్గుపడాల్సిన విషయం అని అన్నారు.

  • Loading...

More Telugu News