Mumbai Indians: ఐపీఎల్ లో నేడు ముంబయి ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ... టాస్ గెలిచిన ముంబయి

Mumbai Indians won the toss and elected to bat first against Delhi Capitals
  • చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
  • ఆడమ్ మిల్నే స్థానంలో జయంత్ యాదవ్ కు చోటు
  • టాస్ గురించి పెద్దగా ఆలోచించడంలేదన్న ఢిల్లీ సారథి పంత్
ఐపీఎల్ లో నేడు ఆసక్తికర సమరం జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ పోరులో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముంబయి జట్టులో ఒక మార్పు జరిగింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే స్థానంలో వెటరన్ స్పిన్నర్ జయంత్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకున్నట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్ మాట్లాడుతూ, టాస్ గురించి పెద్దగా ఆలోచించడం లేదని తెలిపాడు. టాస్ గెలిచుంటే తాము కూడా మొదట బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని పేర్కొన్నాడు. తుది జట్టులోకి హెట్మెయర్, అమిత్ మిశ్రా వచ్చారని వెల్లడించాడు.
Mumbai Indians
Toss
Batting
Delhi Capitals
MA Chidambaram Stadium
Chennai

More Telugu News