జైలు నుంచి బయటకు రాకుండానే... మరోమారు దీప్ సిద్ధూ అరెస్ట్!
- శనివారం నాడు దీప్ సిద్దూకు బెయిల్
- జైలు నుంచి విడుదల కాకముందే అరెస్ట్
- పురావస్తు శాఖ అధికారుల ఫిర్యాదు
ఫిబ్రవరి 9న దీప్ సిద్ధూ అరెస్ట్ కాగా, అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నాడు. తన క్లయింట్ నిరపరాధని, పోలీసుల విచారణకు సహకరిస్తారని దీప్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించడంతో న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తుకు అదనంగా ఇద్దరితో రూ. 30 వేల చొప్పున జామీనుతో బెయిల్ ఇచ్చారన్న సంగతి తెలిసిందే.