Kiren Rijiju: కరోనా బారినపడిన మరో కేంద్ర మంత్రి

Union sports minister Kiren Rijiju tested corona positive
  • కిరణ్ రిజిజుకు కరోనా పాజిటివ్
  • డాక్టర్ల సలహా మేరకు చికిత్స
  • తనను కలిసిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలన్న రిజిజు
  • కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన
కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు తాజాగా కరోనా బాధితుల జాబితాలో చేరారు. ఆయన మరోసారి కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని, వారు తమ ఆరోగ్య పరిస్థితిని గమనిస్తుండాలని సూచించారు. స్వీయ నిర్బంధంలో ఉండడమే కాకుండా, కరోనా పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. తనకు కరోనా సోకినప్పటికీ భేషుగ్గా ఉన్నానని స్పష్టం చేశారు.
Kiren Rijiju
Corona Virus
Positive
Sports Minister

More Telugu News