Andhra Pradesh: కేంద్రం పంపిన కరోనా డోసులు ఒక్క రోజుకు కూడా చాలవు: ఏపీ వైద్యారోగ్య శాఖ

Corona doses sent by the center are not enough for a single day says AP health department
  • ఏపీకి చేరుకున్న 6 లక్షల డోసులు
  • అన్ని జిల్లాలకు పంపిణీ చేసిన అధికారులు
  • ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ సిబ్బందికి ప్రాధాన్యతను ఇవ్వాలన్న సీఎం
కేంద్రం పంపిన 6 లక్షల కరోనా డోసులు ఏపీకి చేరుకున్నాయి. ఈ డోసులను వైద్యారోగ్య శాఖ అన్ని జిల్లాలకు పంపిణీ చేసింది. అయితే కేంద్రం పంపిన డోసులు ఒక్క రోజుకు కూడా చాలవని అధికారులు వ్యాఖ్యానించారు. కేంద్రం మరిన్ని డోసులను రాష్ట్రానికి పంపాలని కోరారు.

మరోవైపు ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేషన్ లో అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రానున్న 72 గంటల్లో హెల్త్ కేర్ వర్కర్లకు వంద శాతం వ్యాక్సినేషన్ ను పూర్తి చేయాలని చెప్పారు. కరోనాపై పోరాటంలో హెల్త్ కేర్ వర్కర్లు ప్రధానమని.. వారందరికీ వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు.

ఇంకా వ్యాక్సిన్ వేయించుకోని ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ సిబ్బంది 1.80 లక్షల మంది ఉన్నారని, వీరితో పాటు రెండో డోస్ వేయించుకోవాల్సిన వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు.
Andhra Pradesh
Corona Virus
Vaccine
Jagan

More Telugu News