Sonu Sood: మహమ్మారి సమయంలో ఆపద్బాంధవుడిగా నిలిచిన సోనూసూద్ కు కరోనా పాజిటివ్!

Sonusood Tested positive with Corona
  • తనకు కరోనా సోకినట్టు ఈ ఉదయం నిర్ధారణ అయిందన్న సోనూసూద్
  • క్వారంటైన్ లో ఉన్నానని ప్రకటన
  • అందరి కోసం తానున్నాననే విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్య
కరోనా కష్టకాలంలో వేలాది మందికి ఆసరాగా నిలిచి ఆపద్బాంధవుడిగా మారిన సినీ నటుడు సోనూసూద్... చివరకు ఆ మహమ్మారి బారిన పడ్డారు. సోనూకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సోనూ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

 తనకు కరోనా పాజిటివ్ అనే విషయం ఈ ఉదయం నిర్ధారణ అయిందని చెప్పారు. సురక్షిత చర్యల్లో భాగంగా ఇప్పటికే క్వారంటైన్ లో ఉన్నానని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు. తన గురించి ఆందోళన చెందవద్దని... మీ సమస్యలను పరిష్కరించేందుకు తనకు కొంత సమయం లభించిందని చెప్పారు. మీకోసం నేనున్నాననే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు.
Sonu Sood
Corona Positive
Tollywood
Bollywood

More Telugu News