Harsha Vardhan: అందరికీ పూర్తి అవగాహన వచ్చింది... కరోనాను కట్టడి చేయడం సాధ్యమే: కేంద్ర ఆరోగ్య మంత్రి

It is possible to control Corona says Union Health Minister Harsha Vardhan
  • కరోనాపై అవగాహన లేని సమయంలోనే దాన్ని ఎదుర్కొన్నాం
  • కానీ కరోనా పట్ల తేలిక భావం వద్దు
  • రెమ్ డెసివిర్ ను బ్లాక్ మార్కెట్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అన్నారు. కరోనా పట్ల తేలిక భావన కలిగి ఉండవద్దని ప్రజలను హెచ్చరించారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంతో పోలిస్తే ఇప్పుడు మనందరికీ వైరస్ పై పూర్తి అవగాహన వచ్చిందని... అందరూ జాగ్రత్తలు పాటిస్తే వైరస్ ను నియంత్రించడం సాధ్యమేనని చెప్పారు. కరోనా గురించి మనకు అవగాహన లేని సమయంలోనే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని... ఇప్పుడు కూడా దాన్ని కట్టడి చేస్తామని అన్నారు.

రెమ్ డెసివిర్ ఔషధం కొరత ఉన్న నేపథ్యంలో వాటి ఉత్పత్తిని భారీగా పెంచాలని ఆయా ఫార్మా కంపెనీలను ఇప్పటికే ఆదేశించామని తెలిపారు. ఈ ఔషధాన్ని ఎవరైనా బ్లాక్ మార్కెట్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని... ఈ మేరకు ఇప్పటికే ఎన్ఫోర్స్ మెంట్ అధికారులకు ఆదేశాలను జారీ చేశామని చెప్పారు. వైరస్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, ఎన్95 మాస్కులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Harsha Vardhan
Union Health Minister
Corona Virus

More Telugu News