Charan: చరణ్ జోడీగా రష్మికను సెట్ చేసిన శంకర్?

Rashmika is going to act with charan in shankar movie
  • చరణ్ హీరోగా శంకర్ సినిమా
  • ఆల్రెడీ కథ వినేసిన రష్మిక
  • ఈ జోడీ ఖాయమేననేది కోలీవుడ్ టాక్        
ఇప్పుడు ఎక్కడ చూసినా మెగా అభిమానులు శంకర్ కాంబినేషన్లో చరణ్ చేయనున్న సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గర నుంచి, అంతా అప్ డేట్స్ తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ఎవరికి ఛాన్స్ దొరకనుందనేది కూడా కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక పేరు తెరపైకి వచ్చింది. ఆల్రెడీ ఆమెకి కథను వినిపించడం జరిగిపోయిందని అంటున్నారు.

నిజానికి రష్మిక చాలా బిజీ .. తెలుగు .. హిందీ .. కన్నడ భాషల్లో ఆమె వరుస సినిమాలు చేస్తోంది. తెలుగులో నెంబర్ వన్ ప్లేస్ కి ఆమె ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇక శంకర్ కథ చెప్పకున్నా ఓకే చెప్పేసే స్టార్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. చరణ్ జోడిగా అంటే తమ పాత్ర గురించి పట్టించుకోని హీరోయిన్లు ఉన్నారు. పైగా ఇది పాన్ ఇండియా సినిమానాయే. అందువలన రష్మిక అభ్యంతరం చెప్పే అవకాశమైతే లేదు.
Charan
Rashmika Mandanna
Shankar

More Telugu News