YSRCP: వైఎస్​ వివేకానందరెడ్డి హత్యపై సంచలన విషయాలు వెల్లడించిన ఏబీ వెంకటేశ్వరరావు

Shocking Points revealed in YS Vivekananda Reddy Murder Case
  • సీబీఐకి లేఖ రాసిన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్
  • హత్య జరిగి గంటలు గడిచినా లోపలికి రానివ్వలేదని ఆరోపణ
  • కొందరు నేతలు అడ్డుకున్నారని వెల్లడి
  • ఇల్లంతా ఎంపీ అవినాష్ రెడ్డి అధీనంలోనే ఉందని కామెంట్
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ మేరకు ఆయన సీబీఐకి లేఖ రాశారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన చాలా సేపటిదాకా పోలీసులను కొందరు ప్రజాప్రతినిధులు లోపలికి రానివ్వలేదని ఆరోపించారు.

పోలీసులను వారు కావాలనే అడ్డుకున్నారని ఆరోపించారు. గుండెపోటుతో మరణించారని నమ్మించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారన్నారు. వివేకానందరెడ్డిని హత్య చేసిన తర్వాత.. ఇల్లు కడగడం దగ్గర్నుంచి, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించేదాకా ఎంపీ అవినాష్ రెడ్డి తన అధీనంలోనే ఉంచుకున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఆ సమయంలో మీడియాను కానీ, ఇంటెలిజెన్స్ బృందాన్ని గానీ, పోలీసులను గానీ లోపలికి అనుమతించలేదని తెలిపారు. హత్య జరిగి ఏడాది గడుస్తున్నా దర్యాప్తులో ఇంత వరకు పురోగతి లేదన్నారు. కేసు పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని అప్పటి సీబీఐ దర్యాప్తు అధికారి ఎన్.ఎం.సింగ్ కు ఫోన్ చేసి చెప్పినా తీసుకోలేదని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. హత్య జరిగినప్పుడు తానే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నానని, అందుకే కావాలనే తనను విధుల నుంచి తొలగించి ఉంటారని అన్నారు.
YSRCP
YS Jagan
YS Vivekananda Reddy
Andhra Pradesh

More Telugu News