TRS: టీఆర్ఎస్ 20 ఏళ్ల ఉత్సవాలు వాయిదా!

TRS Foundation Day Celebrations Postponed
  • ఈ నెల 27తో టీఆర్ఎస్ స్థాపించి రెండు దశాబ్దాలు
  • ఉత్సవాలను వేడుకగా నిర్వహించాలని తొలుత నిర్ణయం
  • కరోనా కేసులు పెరుగుతుండటంతో వాయిదా
తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, ఈ నెల 27కు రెండు దశాబ్దాలు పూర్తి కానుండగా, ఈ సందర్భంగా పార్టీ తలపెట్టిన ఉత్సవాలు వాయిదా పడ్డాయి. ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో, ఉన్నతాధికారులు, ఇతర నేతలు చేసిన సూచనలతో పాటు, మినీ పురపోరుకు నోటిఫికేషన్ విడుదలైన కారణంగా వీటిని వాయిదా వేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ  ఉత్సవాలను మరో సమయంలో ఘనంగా నిర్వహిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
TRS
Foundation Day
Celebrations
Postpone

More Telugu News