Nosode: కరోనా మహమ్మారికి ప్రపంచంలోనే తొలి హోమియో టీకా.. 62 శాతం ప్రభావశీలత

First in world Homiopathic corona vaccine will be available soon
  • ‘నొసోడ్’ను అభివృద్ధి చేసిన పరిశోధకుడు డాక్టర్ రాజేశ్
  • హోమియోపతి టీకాలపై అనుమానాలు అక్కర్లేదంటున్న నిపుణులు
  • కరోనా లక్షణాలు తగ్గించి రోగ నిరోధకశక్తిని పెంచుతున్న హోమియోపతి టీకా
కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ ఇది శుభవార్తే.  ప్రపంచంలోనే తొలిసారి కరోనాకు భారత్‌లో తయారైన హోమియోపతి టీకా (నొసోడ్) అందుబాటులోకి రాబోతోంది. ఇది 62 శాతం ప్రభావవంతంగా పనిచేసినట్టు పరీక్షల్లో తేలింది. శరీరంలో కరోనా లక్షణాలను తగ్గించడం, రోగనిరోధకశక్తిని పెంచడం, మనసుకు సాంత్వన చేకూర్చడంలో ఇది అద్భుతంగా పనిచేస్తున్నట్టు రుజువైంది.

హోమియోపతి టీకాలు ఉంటాయా? అనే సందేహం అక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. టీకా అనేది మనిషి సహజ రోగ నిరోధకశక్తిని బలోపేతం చేసి, ప్రత్యేకంగా ఒక వ్యాధి నుంచి రక్షణ కల్పించాలని రోగ నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) చెబుతోందని, దీని ప్రకారం నొసాడ్‌ను టీకాగానే గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు.

హోమియోపతి టీకా నొసోడ్‌ను ముంబైలోని లైఫ్ ఫోర్స్ హోమియోపతి అండ్ బయోసిమిలా చీఫ్, పరిశోధకుడు అయిన డాక్టర్ రాజేశ్ షా అభివృద్ధి చేశారు. అనంతరం క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు తేలింది. డాక్టర్ రాజేశ్ షా గత రెండు దశాబ్దాల్లో పలు హోమియో ఔషధాలను, రెండు టీకాలను అభివృద్ధి చేశారు.
Nosode
Homiopathy Vaccine
Corona Virus
Mumbai

More Telugu News