ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగుతుండటంపై ఇండియన్ మిలిటరీ చీఫ్ ఆందోళన!
- మే 1 నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన బైడెన్
- ఆటంకవాదులు మళ్లీ ప్రవేశించే అవకాశం ఉందన్న జనరల్ రావత్
- ఇప్పటి వరకు ఆఫ్ఘాన్ లో 2,400 మంది అమెరికా సైనికుల మృతి
ఆఫ్ఘనిస్థాన్ లో సుదీర్థ యుద్ధానికి ముగింపు పలుకుతున్నామని... మే 1వ తేదీ నుంచి భద్రతాబలగాలను వెనక్కి రప్పిస్తున్నామని బైడెన్ చెప్పారు. దాదాపు 2 దశాబ్దాలుగా ఆఫ్థనిస్థాన్ లో నాటో బలగాలు మోహరించి ఉన్నాయి. అమెరికా నేతృత్వంలో నాటో దళాలు తాలిబాన్లపై ఉక్కుపాదం మోపాయి. ఇదే సమయంలో దాదాపు 2,400 మంది అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్థాన్ లో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆఫ్ఘన్ సైనికులు మృతి చెందారు.