Alla Nani: కరోనా పంజా.. ఆ ఆరు జిల్లాలపై ఫోకస్ పెట్టండి: ఏపీ ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని

Focus on those six districts amid raise in corona cases orders Alla Nani
  • ఆరు వారాల్లో కేసులు భారీగా పెరిగే అవకాశాలున్నాయి
  • గతంలో కంటే కరోనా వేగంగా విస్తరిస్తుంది
  • అన్ని ఆసుపత్రుల్లో బెడ్లు సిద్ధం చేయండి
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాలపై కరోనా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలతో వైద్య మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.

రానున్న ఆరు వారాల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని... గతం కంటే ఎక్కువ వేగంతో కరోనా విస్తరిస్తుందని చెప్పారు. అన్ని ఆసుపత్రుల్లో బెడ్స్ ను సిద్ధం చేయాలని ఆదేశించారు. కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు. ఏలూరులో ఒక్కరోజే 40 కేసులు నమోదు కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
Alla Nani
Andhra Pradesh
Corona Virus

More Telugu News