vishnu varthan reddy: నాడు సానుభూతి కోసం 'కోడికత్తి' సంఘటన.. నేడు 'రాళ్లదాడి' ఘ‌టన: విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి వ్యంగ్యం

vishnu varthan slams ycp
  • సరి లేరు-మీకేవ్వరు?
  • నాడు జగనన్న.!  నేడు చంద్రన్న.!
  • సందర్భాలు, సంఘటనలు వేరైనా ఇద్దరి ఉద్దేశాలు ఒక్కటే
  • ఓట్ల కోసం డ్రామాలు వేయడంలోను మీకు మీరే సాటి  
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు సీఎం వైఎస్ జ‌గ‌న్ పై ఓ యువ‌కుడు కోడిక‌త్తితో దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల తిరుప‌తి ఉప ఎన్నిక ప్ర‌చార స‌భ‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై రాళ్ల‌దాడి ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. అయితే, ఈ రెండు ఘ‌ట‌న‌లు డ్రామాలేన‌ని బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఆరోపించారు.

'సరి లేరు-మీకేవ్వరు? నాడు జగనన్న.!  నేడు చంద్రన్న.! నాడు సానుభూతి కోసం కోడికత్తి సంఘటన.! నేడు సానుభూతి కోసం రాళ్లదాడి సంఘటన.! సందర్భాలు, సంఘటనలు వేరైనా ఇద్దరి ఉద్దేశాలు మాత్రం ఒక్కటేనని ప్రజలకు  తెలుసు. ఓట్ల కోసం డ్రామాలు వేయడంలోను మీకు మీరే సాటి' అని విష్ణువ‌ర్ధ‌ర్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.
vishnu varthan reddy
BJP
Andhra Pradesh

More Telugu News