Maruti Suzuki: మారుతి కార్ల రికార్డు.. ఇండియాలో టాప్-5 సెల్లింగ్ కార్లు ఈ సంస్థవే!

Top 5 Selling Car Brands in india is Maruti Suzuki
  • అత్యధికంగా అమ్ముడయ్యే బ్రాండ్ గా మారుతి సుజుకి
  • అత్యధిక యూనిట్ల అమ్మకాల్లో స్విఫ్ట్
  • ఆపై బాలెనో, వేగనార్, ఆల్టో, డిజైర్
  • గర్వంగా ఉందన్న ఈడీ శ్రీవాత్సవ
ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్ల బ్రాండ్ ఏంటన్న ప్రశ్న ఎదురైతే, ఎవరైనా మారుతి సుజుకి పేరే చెబుతారు. ఇక, ప్రస్తుతం ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్-5 మోడల్ కార్లు ఏంటన్న ప్రశ్న వినిపిస్తే, దానికి కూడా మారుతి సుజుకి నుంచి మార్కెటింగ్ అవుతున్న కార్ల పేర్లు వరుసగా చెప్పుకుంటూ వెళ్లాలి. గడచిన 2020-21 సంవత్సరంలో జరిగిన కార్ల అమ్మకాల్లో అధిక కార్లు మారుతి సుజుకి మోడళ్లవే.

గత ఏడాది స్విఫ్ట్ కార్లు 1.72 లక్షల యూనిట్లు విక్రయమై తొలి స్థానాన్ని ఆక్రమించగా, రెండో స్థానంలో బాలెనో 1.63 లక్షలు, వేగనార్ 1.50 లక్షలు, ఆల్టో 1.59 లక్షలు, డిజైర్ 1.28 లక్షల యూనిట్లుగా నిలిచి టాప్-5 స్థానాల్లో నిలిచాయి. ఈ ఐదు మోడళ్ల కార్లు మోత్తం విక్రయాల్లో 30 శాతాన్ని ఆక్రమించడం గమనార్హం. ఇతర కంపెనీల నుంచి తమకు భారీగా పోటీ ఉందని, అయినా తామందిస్తున్న మోడల్స్ టాప్-5లో నిలవడం చాలా గర్వకారణమని సంస్థ ఈడీ శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు.
Maruti Suzuki
Swift
Top Selling
Top-5

More Telugu News