బాలా మావయ్య టెర్రిఫిక్: 'అఖండ' టీజర్ పై లోకేశ్ స్పందన
- బాలయ్య, బోయపాటి చిత్రానికి 'అఖండ' టైటిల్ ఖరారు
- ఉగాది కానుకగా టీజర్ విడుదల
- ఎంతో థ్రిల్లయ్యానన్న లోకేశ్
- బాలా మావయ్య ఉగ్రరూపం ప్రదర్శించాడని కితాబు
- సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం అంటూ ట్వీట్
బోయపాటి దర్శకత్వంలో బాలయ్య గతంలో 'సింహా', 'లెజెండ్' చిత్రాల్లో నటించగా రెండూ పెద్ద హిట్లయ్యాయి. ఇప్పుడీ మూడో చిత్రంలో నందమూరి హీరో అఘోరాగా కనిపిస్తాడని తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ లో త్రిశూలంతో బాలకృష్ణ రౌద్రరసం పండించాడు. ఉగాది కానుకగా వెలువడిన 'అఖండ' టీజర్ నందమూరి అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.