Peddireddi Ramachandra Reddy: చంద్రబాబుపై రాళ్లు ఎవరేశారో త్వరలోనే పోలీసులు తేలుస్తారు: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి

Who Pelt Stones on Chandrababu will Decide Police says Peddireddy
  • నిన్న చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి
  • రాళ్లు వేయాల్సిన అవసరం ఎవరికి ఉంది?
  • సానుభూతి కోసం ఈ పనిచేసుకుని ఉండచ్ఛన్న మంత్రి 
నిన్న తిరుపతిలో చంద్రబాబు కాన్వాయ్ పై ఎవరు దాడి చేశారన్న విషయాన్ని పోలీసులు విచారించి తేలుస్తారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనపై రాళ్లు వేయాల్సిన అవసరం ఎవరికి ఉందని ప్రశ్నించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, అయినప్పటికీ, నిందితులను పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారని అన్నారు.

వైసీపీ కార్యకర్తలు రాళ్లు వేశారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను పెద్దిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తామేమీ తిరుపతి ఎన్నికల్లో ఓడిపోతామని భావించడం లేదని, తెలుగుదేశం తమకు పోటీని ఇస్తుందని కూడా అనుకోవడం లేదని అన్నారు. అటువంటప్పుడు తమవారు రాళ్లు ఎందుకు వేస్తారని ప్రశ్నించారు. తెలుగుదేశం నేతలే సానుభూతి కోసం ఈ పని చేయించి ఉండవచ్చని, ఏది ఏమైనా ఘటన వెనుక ఎవరున్నారన్న విషయం త్వరలోనే తేలుతుందని పేర్కొన్నారు.
Peddireddi Ramachandra Reddy
Stones
Chandrababu
Tirupati

More Telugu News