Vijayasai Reddy: అంపైర్ తన వాడైతే తప్ప చంద్రబాబు ఆట ఆడడు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy comments on Chandrababu
  • తనపై తనకే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు
  • పొత్తు ఉంటే తప్ప ఆయనకు పొద్దు పొడవదు
  • తిరుపతి ఫీట్లన్నీ పొత్తుల కోసం తిప్పలే
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. అంపైర్ తన వాడైతే తప్ప చంద్రబాబు ఆట ఆడడని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలపైనే కాదు, తనపై తనకే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. పొత్తు ఉంటే తప్ప ఆయనకు పొద్దు పొడవదని అన్నారు.

బాబు తిరుపతి ఫీట్లన్నీ పొత్తుల కోసం తిప్పలేనని విమర్శించారు. కులం కలిసిరాకపోవడంతో మతం పట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబును విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు.
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News