Chandrababu: చంద్రబాబుతో సన్నిహితంగా తిరిగిన నేతకు కరోనా పాజిటివ్.. టీడీపీలో టెన్షన్!

TDP leader who spent with Chadrababu tested with Corona positive
  • శ్రీకాళహస్తి టీడీపీ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్
  • ఈ నెల 8న చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్న బొజ్జల
  • మాస్క్ లేకుండానే చంద్రబాబుతో మాట్లాడిన వైనం
తెలుగుదేశం పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. శ్రీకాళహస్తి పార్టీ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో, ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఈ నెల 8న శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. మాస్క్ ధరించకుండానే చంద్రబాబుతో సుధీర్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఆయన పక్కనే నిలబడ్డారు. ఇప్పుడు ఆయన కరోనా బారిన పడటంతో... చంద్రబాబు గురించి పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పుడు ఈ అంశం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Chandrababu
Telugudesam
Bojjala Sudheer Reddy
Sri Kalahasthi
Corona Virus

More Telugu News