Vakeel Saab: కొవిడ్ రూల్స్ గాలికి.. ఒడిశాలో వకీల్‌సాబ్ సినిమా ప్రదర్శిస్తున్న రెండు థియేటర్ల సీజ్

Theaters which are showing vakeel saab in Odisha Parlakhemundi seized
  • పవన్ సినిమాకు ఒడిశాలోనూ ఆదరణ
  • పర్లఖెముండిలో థియేటర్లకు పోటెత్తిన అభిమానులు
  • కరోనా నిబంధనల ఉల్లంఘన
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’కు ఒడిశాలోనూ మంచి ఆదరణ లభిస్తోంది.‘వకీల్‌సాబ్’ను చూసేందుకు అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించడం లేదంటూ ఈ సినిమాను ప్రదర్శిస్తున్న గజపతి జిల్లా పర్లాఖెముండిలోని రెండు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు.

పట్టణంలోని రెండు థియేటర్లలో సినిమా విడుదల కాగా, సినిమాను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. దీంతో థియేటర్ల వద్ద భారీ రద్దీ ఏర్పడుతోంది. ఆదివారం కావడంతో నిన్న అభిమానుల తాకిడి మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో కొవిడ్ నిబంధనలు గాలికి ఎగిరిపోయాయి. స్పందించిన అధికారులు కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ రెండు సినిమా థియేటర్లను తాత్కాలికంగా సీజ్ చేశారు.
Vakeel Saab
Pawan Kalyan
Odisha
paralakhemundi

More Telugu News