Sonu Sood: సోనూ సూద్ కు మరో గౌరవం... పంజాబ్ కరోనా వ్యాక్సినేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం

Sonu Sood appointed as Punjab corona vaccination brand ambassador
  • కరోనా కాలంలో సోనూ సూద్ దాతృత్వం
  • అపర దానకర్ణుడిగా గుర్తింపు
  • సోనూ సూద్ కు అనేక సన్మానాలు
  • పంజాబ్ లో కరోనా వ్యాక్సినేషన్
  • సోనూ సూద్ మద్దతు ఎంతో ఉపయోగకరమన్న పంజాబ్ సీఎం
ప్రముఖ నటుడు సోనూ సూద్ కరోనా కష్టకాలంలో అపర దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్నాడు. పేదల పాలిట పెన్నిధిగా మారిన సోనూ సూద్ ఎవరడిగినా కాదనకుండా సాయం చేస్తూ మానవతను చాటుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయనను అనేక ఘనతలు వరించాయి. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సోనూ సూద్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఈ మేరకు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడించారు.

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత ముందుకు వెళ్లేందుకు సోనూ సూద్ మద్దతు ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ప్రతి ఒక్క పంజాబీని రక్షించుకోవడమే తమ కర్తవ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సీఎం అమరీందర్ సింగ్ పిలుపునిచ్చారు.
Sonu Sood
Brand Ambassador
Punjab
Corona Vaccination

More Telugu News