Mekapati Goutham Reddy: ఏపీ మంత్రి మేక‌పాటి ట్విట్ట‌ర్ ఖాతా హ్యాక్.. అశ్లీల చిత్రాలు పోస్ట్ చేసిన వైనం

mekapati twiitter account hacked
  • ఆల‌స్యంగా గుర్తించిన మేక‌పాటి
  • ట్విట్ట‌ర్‌ సంస్థతో పాటు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు
  • ఫాలోవ‌ర్ల‌కు క్ష‌మాప‌ణ‌లు  
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ట్విట్ట‌ర్‌ ఖాతాలో కొంద‌రు హ్యాక‌ర్లు అశ్లీల చిత్రాల‌ను పోస్ట్ చేయ‌డం క‌ల‌కలం రేపింది. ఈ విష‌యాన్ని మంత్రి మేక‌పాటి ఆల‌స్యంగా గుర్తించారు. త‌న ట్విట్ట‌ర్‌ ఖాతా హ్యాక్ అయింద‌ని తెలుసుకున్న ఆయ‌న దీనిపై ట్విట్ట‌ర్‌ సంస్థతో పాటు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విష‌యాల‌ను వివ‌రిస్తూ ఆయ‌న ట్వీట్ చేశారు. తన ట్విట్ట‌ర్ ఖాతాలో అశ్లీల చిత్రాలు క‌న‌ప‌డినందుకు త‌న ఫాలోవ‌ర్ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఆయన ట్విట్ట‌ర్ ఖాతాలో వ‌చ్చిన అశ్లీల చిత్రాల‌ను సిబ్బంది తొలగించారు.
Mekapati Goutham Reddy
YSRCP
Twitter

More Telugu News