Siddharth: సిద్ధార్థ్ హీరోగా 'ఒరేయ్ బామ్మర్ది' .. టీజర్ రిలీజ్

Orey Baammardi Teaser Released
  • 'బిచ్చగాడు' దర్శకుడి నుంచి మరో సినిమా
  • ఆకతాయి కుర్రాడిగా జీవీ ప్రకాశ్ కుమార్
  • ట్రాఫిక్ పోలీస్ పాత్రలో సిద్ధార్థ్  
టాలీవుడ్ లో ఒకప్పుడు సిద్ధార్ధ్ లవర్ బాయ్ గా చెలరేగిపోయాడు. వరస విజయాలతో ఇక్కడి యువ హీరోలకు గట్టిపోటీ ఇచ్చాడు. కానీ ఆ తరువాత వరుస పరాజయాలతో వెనుకబడిపోయాడు. అదే సమయంలో తమిళంలోనూ ఆయన అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. తమిళంలో అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. అలా అక్కడ ఆయన చేసిన చిత్రమే 'శివప్పు మంజల్ పిచాయ్'. 'బిచ్చగాడు' ఫేమ్ శశి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. 2019 సెప్టెంబర్ లో అక్కడ విడుదలైన ఈ సినిమా, యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

సిద్ధార్థ్ తో పాటు ఈ సినిమాలో జీవీ ప్రకాశ్ కుమార్ కూడా మరో హీరోగా నటించాడు. 'ఒరేయ్ బామ్మర్ది' టైటిల్ తో ఈ సినిమాను తెలుగులో  విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. సిద్ధార్థ్ ట్రాఫిక్ పోలీస్ గా నటించగా, బెట్టింగులు వేసి .. ట్రాఫిక్ రోడ్లపై బైక్ నడిపే ఆకతాయిగా జీవీ ప్రకాశ్ కుమార్ కనిపిస్త్తున్నాడు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత బాలాజీ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఇక్కడ ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.
Siddharth
GV Prakash Kumar
Shashi

More Telugu News