Chiranjeevi: ప‌వ‌న్ కల్యాణ్‌లో మ‌ళ్లీ అదే వేడి, అదే వాడి!: చిరంజీవి

chiranjeevi says Terrific Act by PawanKalyan
  • వకీల్ సాబ్ సినిమాపై చిరు ప్ర‌శంస‌లు
  • ప్ర‌కాశ్ రాజ్‌తో కోర్టు రూమ్ డ్రామా అద్భుతం
  • నివేదా థామస్, అంజ‌లి, అనన్య వాళ్ల పాత్ర‌ల్లో జీవించారు
  • వ‌కీల్ సాబ్ కేసుల‌నే కాదు.. అంద‌రి మ‌న‌సుల్నీ గెలుస్తాడు 
మూడేళ్ల తర్వాత  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా నిన్న‌ థియేటర్లలో విడుదలైన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాను నిన్న మెగాస్టార్ చిరంజీవి త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చూశారు. ఈ సినిమాపై ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ ఆయ‌న ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

'మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత ప‌వ‌న్ కల్యాణ్ మ‌ళ్లీ అదే వేడి, అదే వాడి.. ప్ర‌కాశ్ రాజ్‌తో కోర్టు రూమ్ డ్రామా అద్భుతం. నివేదా థామస్, అంజ‌లి, అనన్య వాళ్ల పాత్ర‌ల్లో జీవించారు. సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్, డీఓపీ వినోద్ ప్రాణం పోశారు. దిల్ రాజుకి, బోనీ క‌పూర్ జీకి, డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్ తో పాటు మిగ‌తా టీమ్ కి నా శుభాకాంక్ష‌లు. అన్నింటికీ మించి మ‌హిళ‌ల‌కి ఇవ్వాల్సిన గౌర‌వాన్ని తెలియ‌జేసే అత్య‌వ‌స‌ర‌మైన చిత్రం. ఈ వ‌కీల్ సాబ్ కేసుల‌నే కాదు.. అంద‌రి మ‌న‌సుల్నీ గెలుస్తాడు' అని చిరంజీవి పేర్కొన్నారు. కాగా, వ‌కీల్ సాబ్ సినిమాకు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.
Chiranjeevi
Tollywood
Pawan Kalyan
Vakeel Saab

More Telugu News