12-15 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్.. ప్రభుత్వ అనుమతి కోరిన ఫైజర్
- ఫైజర్, బయోఎన్‌టెక్ కలిసి అభివృద్ధి
- అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి కోరుతూ దరఖాస్తు
- ట్రయల్స్‌లో అత్యుత్తమ ఫలితాలు కనిపించాయన్న ఫైజర్
ఫైజర్, జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్ కలిసి అభివృద్ది చేసిన ఈ టీకా 12-15 ఏళ్ల మధ్యనున్న చిన్నారుల్లో వందశాతం ప్రభావవంతంగా పనిచేసినట్టు ఈ సంస్థలు పేర్కొన్నాయి. ట్రయల్స్‌లో అత్యుత్తమ ఫలితాలు వచ్చాయని తెలిపాయి. టీకా వేసినప్పుడు పెద్దల్లో కనిపించిన లక్షణాలే చిన్నారుల్లోనూ కనిపించాయని, అంతకుమించి ప్రతికూల ప్రభావాలేవీ నమోదు కాలేదని ఫైజర్ పేర్కొంది.