Naigeria: నైజీరియా యువతి సంచలనం... 8 నెలల గర్భంతో తైక్వాండోలో స్వర్ణ పతకం!
- నైజీరియాలో స్పోర్ట్స్ మీట్
- వివిధ ఈవెంట్లలో నాలుగు పతకాలు సాధించిన అమితాస్
- ప్రశంసల వర్షం
దృఢమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమేనని నైజారియాకు చెందిన 26 ఏళ్ల అమితాస్ ఇద్రిస్ అనే ఎనిమిది నెలల గర్భిణి నిరూపించింది. ఎనిమిది నెలల బిడ్డను గర్భంలో దాచుకుని, ఆటల పోటీల్లో పాల్గొనడం అత్యంత అరుదు. అలా పోటీ పడి, పతకం కూడా సంపాదిస్తే, అది అద్భుతమే. అదే అద్భుతాన్ని సాధించింది అమితాస్ ఇద్రిస్.
నైజీరియాలో జరిగిన స్పోర్ట్స్ ఫెస్టివల్ లో భాగంగా తైక్వాండో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మిక్స్ డ్ పూమ్సే కేటగిరీలో స్వర్ణపతకం సాధించిన అమితాస్, మరో మూడు విభాగాల్లోనూ పతకాలు సొంతం చేసుకోవడం గమనార్హం. అమితాస్ సంకల్పంపై ఇప్పుడు సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.