IPL-2021: నేటి నుంచే ఐపీఎల్ 14వ సీజన్... తొలి మ్యాచ్ లో ముంబయి వర్సెస్ బెంగళూరు

IPL kick starts with Mi and RCB opener at Chennai MA Chidambaram Stadium
  • ఐపీఎల్ 2021కు నేడు ప్రారంభం
  • టాస్ గెలిచిన బెంగళూరు
  • బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ
  • చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్
క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చేసింది. ఐపీఎల్ 14వ సీజన్ నేటి నుంచి మే 30 వరకు సిసలైన క్రికెట్ వినోదాన్ని అందించనుంది. ఇవాళ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు.

కాగా, కొవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ టోర్నీని పరిమిత వేదికల్లోనే నిర్వహిస్తున్నారు. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఐపీఎల్ తాజా సీజన్ లో 60 మ్యాచ్ లు జరగనున్నాయి. ఏ జట్టు కూడా సొంతగడ్డపై ఆడే పరిస్థితి లేదు. దాంతో అన్ని జట్లకు సమాన అవకాశాలు ఏర్పడడమే కాకుండా, మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగనున్నాయి.
IPL-2021
New Season
Mumbai Indians
Royal Challengers Banglore
Chennai
India

More Telugu News