Direct Taxes: 2020-21లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.9.45 లక్షల కోట్లు

Direct taxes collections in country crosses budget estimations
  • బడ్జెట్ అంచనాలకు మించి పన్నుల వసూళ్లు
  • రూ.9.05 లక్షల కోట్లు వసూలవుతాయని బడ్జెట్ అంచనా
  • అంచనా కంటే 5 శాతం అధికంగా వసూళ్లు
  • కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ వసూళ్ల వృద్ధి
దేశంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని మించి ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. 2020-21లో రూ.9.45 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలైనట్టు కేంద్రం వెల్లడించింది. బడ్జెట్ అంచనాల్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.9.05 లక్షల కోట్లు ఉంటాయని అంచనా వేయగా, అంతకంటే 5 శాతం ఎక్కువే వసూలయ్యాయి. కరోనా సంక్షోభంలోనూ ఈ మేర వృద్ధి సాధించడం విశేషం అని భావించాలి.

ఇక 2020-21లో పన్నుల వివరాల్లోకెళితే.... రూ.4.57 లక్షల కోట్ల కార్పొరేట్ పన్ను వసూళ్లు వచ్చిపడ్డాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు రూ.4.71 లక్షల కోట్లు కాగా, సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను రూపంలో రూ.16,927 కోట్లు వసూలయ్యాయి.
Direct Taxes
Estimations
Collections
Corona Pandemic
India

More Telugu News