Jagan: ఎన్నికలు అయిపోయాయి... ఇక వ్యాక్సినేషన్ ముమ్మరం చేయండి: సీఎం జగన్

CM Jagan directs state officials speed up corona vaccination
  • ఏపీలో ముగిసిన స్థానిక ఎన్నికలు
  • కరోనా పరిస్థితులపై దృష్టి సారించిన సీఎం జగన్
  • ఈ నెల 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్
  • రోజుకు 6 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఇటీవలే పూర్తి కాగా, నిన్న పరిషత్ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఆ ఫలితాలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఏపీలో కరోనా పరిస్థితులపై దృష్టి సారించారు. ఎన్నికలు అయిపోయాయని, ఇక రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేయాలని అధికారులకు నిర్దేశించారు.

ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు కేంద్రం ఆదేశాలతో టీకా ఉత్సవ్ చేపట్టాలని, రోజుకు 6 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. టీకా ఉత్సవ్ జరిగే 4 రోజుల్లో 24 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు అందించాలని ఆదేశించారు. టీకా ఉత్సవ్ ముగిశాక వ్యాక్సిన్ డోసుల కొరత ఏర్పడితే కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని సూచించారు.
Jagan
Corona Vaccination
Teeka Utsav
Andhra Pradesh
Local Body Polls

More Telugu News