Balakrishna: 'ఉగాది'కి బాలయ్య మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్?

Balakrishna movie title will be announced on Ugadi
  • బోయపాటితో బాలయ్య మూడో సినిమా
  • కథానాయికగా ప్రగ్యా జైస్వాల్
  • మే 28వ తేదీన భారీ విడుదల      
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో సినిమా అనగానే మాస్ ఆడియన్స్ లో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. అందుకు కారణం .. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' సినిమాలు సంచలన విజయాలను నమోదు చేయడమే. ఆ రెండు సినిమాలకి మించి ఇప్పుడు మూడో సినిమా ఉంటుందని బోయపాటి చెప్పిన దగ్గర నుంచి, బాలయ్య అభిమానులు ఈ సినిమా  కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా కోసం బోయపాటి పరిశీలిస్తున్నట్టుగా రెండు మూడు టైటిల్స్ బయటికి వచ్చాయి. కానీ ఇంతవరకూ ఏ టైటిల్ ను కూడా ఫిక్స్ చేయలేదు. 'ఉగాది'కి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఈ సినిమా టీమ్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాను మే 28వ తేదీన విడుదల చేస్తామనే ప్రకటన చేస్తూ పోస్టర్ ను వదిలిన తరువాత, ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు. కరోనా వ్యాప్తి కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన, రిలీజ్ డేట్ వాయిదా వేసే ఉద్దేశంతోనే అప్ డేట్స్ ఇవ్వడం లేదనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది.

మరి 'ఉగాది'కైనా అభిమానులను హుషారెత్తిస్తారేమో చూడాలి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో, బాలకృష్ణ సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ కనువిందు చేయనుంది. ఈ సినిమాతో బాలకృష్ణ - బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.
Balakrishna
Pragya Jaiswal
Boyapati Sreenu

More Telugu News