Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు నిరసన.. టీడీపీ కార్పొరేటర్ల పాదయాత్ర

Vizag TDP Coroprators Padayatra against vizag steel plant privatisation
  • అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి కాగడాలతో పాదయాత్ర
  • ఉక్కు పరిశ్రమ పోరాట కమిటీ సభ్యుల సంఘీభావం
  • పరిశ్రమ ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే కార్మికులు అన్యాయమై పోతారని ఆవేదన
విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైజాగ్‌లో టీడీపీ కార్పొరేటర్లు ఈ ఉదయం పాదయాత్ర నిర్వహించారు. ఈ తెల్లవారుజామున కూర్మన్నపాలెం జంక్షన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కార్పొరేటర్లు కాగడాలతో పాదయాత్ర చేపట్టారు. అక్కడి నుంచి నగరపాలక సంస్థ వరకు పాదయాత్రగా చేరుకున్నారు.

టీడీపీ కార్పొరేటర్లు చేపట్టిన ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్‌లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ అధీనంలోనే ఉండాలని, లేదంటే కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు.
Vizag Steel Plant
TDP
Corporators

More Telugu News