Sachin Tendulkar: కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న సచిన్ టెండూల్కర్

Sachin Tendulker discharge from hospital after corona negative
  • మార్చి 27న సచిన్ కు కరోనా పాజిటివ్
  • ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరిక
  • తాజాగా కరోనా నెగెటివ్
  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జి
  • మరికొన్నిరోజులు ఐసోలేషన్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా నుంచి బయటపడ్డారు. సచిన్ కు మార్చి 27న కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. ఆయన ముందు జాగ్రత్తగా ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ క్రమంలో ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించారు.

ఆసుపత్రి నుంచి ఇప్పుడే ఇంటికి చేరుకున్నానని, కోలుకునే క్రమంలో మరికొన్నిరోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటానని సచిన్ తెలిపారు. తనకోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసుపత్రి సిబ్బంది ఎంతో శ్రద్ధ చూపించారని, ఎంతో మెరుగైన సేవలు అందించారని సచిన్ కొనియాడారు. గత ఏడాది కాలంగా కరోనా చికిత్సలో అలుపెరగకుండా శ్రమిస్తున్నారని కీర్తించారు.
Sachin Tendulkar
Corona Virus
Discharge
Negative
Mumbai
Cricket
India

More Telugu News