Budda Venkanna: వర్ల రామయ్యకు వైసీపీ రౌడీలు ఫోన్ చేసి బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: బుద్ధా వెంకన్న

Budda Venkanna condemns threat calls for Varla Ramaiah
  • పరిషత్ ఎన్నికల అంశంలో వర్ల న్యాయపోరాటం
  • వర్లను బెదిరిస్తున్నారన్న బుద్ధా వెంకన్న
  • బెదిరింపు కాల్స్ పై విచారణ జరిపించాలని డిమాండ్
  • వర్లకు రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టీకరణ
ఏపీలో పరిషత్ ఎన్నికల అంశంలో ఎస్ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య న్యాయపోరాటం చేసిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వర్ల రామయ్యకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వెల్లడించారు.

దళిత నాయకుడు, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు వైసీపీ రౌడీలు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని వివరించారు. ఈ వైఖరిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. వర్ల రామయ్యకు బెదిరింపు కాల్స్ పై విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని బుద్ధా డిమాండ్ చేశారు. వర్ల రామయ్యకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
Budda Venkanna
Varla Ramaiah
YSRCP
Threat Calls
TDP
Andhra Pradesh

More Telugu News