RRR: దొంగగా ఎన్టీఆర్​.. పోలీస్​ గా రామ్​ చరణ్.. 'ఆర్​ఆర్​ఆర్'​ కథాంశంపై ఊహాగానాలు!

Most awaited RRR Movie Story gossip rounds in Film Nagar circles
  • ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ
  • పునర్జన్మ ఇతివృత్తంగా సినిమా కథ
  • ఫస్టాఫ్ అంతా ఎన్టీఆర్ మీదే
  • సెకండాఫ్ లో రామ్ చరణ్ కథ
  • ఇద్దరి మధ్య పోరాట సన్నివేశం
ఆర్ఆర్ఆర్.. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీస్టారర్ పై ఎన్నెన్నో అంచనాలున్నాయి. అప్పుడప్పుడు సినిమాకు సంబంధించిన పోస్టర్లు, మోషన్ పోస్టర్లు, టీజర్లు వదులుతూ ఆ అంచనాలను మరింత పెంచుతున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. గోండు వీరుడు కుమ్రం భీంగా ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఇందులో నటిస్తున్నారు.

అయితే పాత్రల పరంగా సినిమా మూలం ఏంటో తెలుస్తున్నా.. సినిమా అసలు కథేంటన్నదే ఇప్పుడు ప్రశ్న. రాజమౌళి అనే సరికి.. కథ, కథనం, పాత్రల వంటి వాటిపై జనానికి విపరీతమైన అంచనాలు ఉంటాయి. అయితే, ఈ సినిమా పునర్జన్మల ఇతివృత్తంగానే సాగుతుందన్న ప్రచారం జరుగుతోంది. అల్లూరి సీతారామరాజు 1897లో పుట్టి 1924లో చనిపోయారు.. కుమ్రం భీం 1901లో పుట్టి 1940లో మరణించారు.


అయితే, ఆ ఇద్దరూ మళ్లీ పుట్టి బ్రిటిష్ వారిపై పోరాడితే ఎలా ఉంటుందన్న ఊహలోంచే ఈ కథ పుట్టినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. సినిమాలో ఫస్టాఫ్ అంతా ఎన్టీఆర్ మీదే సినిమా కథ నడుస్తుందట. పునర్జన్మలో భాగంగా పుట్టిన ఎన్టీఆర్ పాత్ర దొంగట. సెకండాఫ్ లో రామ్ చరణ్ చుట్టూనే కథ నడుస్తుందని సమాచారం.

పునర్జన్మలో రామ్ చరణ్ పోలీస్ అధికారిగా కనిపిస్తాడని టాక్. ఓ దొంగ, పోలీస్ మధ్య స్టోరీ నడుస్తుందని చెబుతున్నారు. వీరిద్దరి మధ్య ఓ మంచి యాక్షన్ ఘట్టాన్నీ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, అసలు కథేంటన్నది తెలియాలంటే మాత్రం సినిమా విడుదలయ్యే అక్టోబర్ 13 వరకు ఆగాల్సిందే.
RRR
Rajamouli
SS Rajamouli
Jr NTR
Junior NTR
Ramcharan

More Telugu News