Kodali Nani: ఓటు హక్కు లేని పిల్లలతో సీఎం అని పిలిపించుకునే వ్యక్తి పవన్ క‌ల్యాణ్‌: కొడాలి నాని ఎద్దేవా

kodalinani slams pawan
  • పేమెంట్ కోసం ప‌వ‌న్ సొల్లు కబుర్లు చెబుతారు
  • జ‌న‌సేన సైనికులు జన సైకిల్‌గా మారారు
  • సీపీఎం, బీజేపీ పార్టీల‌కు నోటాకు ప‌డిన‌న్ని ఓట్లు కూడా ప‌డ‌వు
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఏపీ మంత్రి కొడాలి నాని విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు. ఓటు హక్కు లేని పిల్లలతో  ఆయ‌న‌ సీఎం అని పిలిపించుకుంటార‌ని కొడాలి నాని ఎద్దేవా చేశారు. పేమెంట్ కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సొల్లు కబుర్లు చెబుతార‌ని ఆయ‌న అన్నారు. జ‌న‌సేన సైనికులు ఇప్పుడు జన సైకిల్‌గా మారారని వ్యాఖ్యానించారు.

కాగా, మంగ‌ళ‌గిరిలో నారా లోకేశ్ ఓడిపోయిన‌ప్ప‌టికీ చంద్రబాబుకు బుద్ధి రాలేదని కొడాలి నాని చెప్పారు. ఎన్నిక‌ల్లో ఇక‌పై చంద్రబాబుకు డిపాజిట్లు కూడా వస్తాయో రావోన‌ని విమ‌ర్శించారు. సీపీఎం, బీజేపీ పార్టీల‌కు నోటాకు ప‌డిన‌న్ని ఓట్లు కూడా ప‌డ‌వ‌ని చెప్పారు. సీఎం  జగన్  పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయ‌న అన్నారు. వైసీపీ బ‌లంగా ఉన్న నేప‌థ్యంలోనే టీడీపీ అధినేత‌ చంద్రబాబు ప‌రిష‌త్ ఎన్నిక‌ల విష‌యంలో నాట‌కాలు ఆడుతున్నార‌ని చెప్పారు.


Kodali Nani
YSRCP
Pawan Kalyan

More Telugu News