Dhanush: కార్తి హిట్ మూవీ సీక్వెల్లో ధనుశ్!

Selva Raghavan Yuganiki Okkadu Sequel
  • 2010లో కార్తి చేసిన భారీ చిత్రం
  • మళ్లీ ఇంతకాలానికి సీక్వెల్
  • విజువల్ వండర్ గా తీర్చేదిద్దే ప్రయత్నం
ఇప్పుడు ఎక్కడ చూసినా సీక్వెల్స్ హవా నడుస్తోంది .. స్టార్ హీరోలంతా ఇంచుమించు సీక్వెల్స్ నే లైన్లో పెడుతున్నారు. తాజాగా ఆ జాబితాలో ధనుశ్ కూడా చేరిపోయాడు. ఈ సీక్వెల్ కి ధనుశ్ సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించనున్నాడు. చాలా కాలం క్రితం సెల్వరాఘవన్ .. కార్తి హీరోగా 'ఆయిరత్తిల్ ఒరువన్' సినిమాను రూపొందించాడు. హీరోగా కార్తి చేసిన మూడో సినిమా ఇది. భారీ బడ్జెట్ తో రవీంద్రన్ నిర్మించిన ఈ సినిమాలో రీమాసేన్ .. ఆండ్రియా కథానాయికలుగా అలరించారు. జానపద నేపథ్యంలో సాగే ఈ సినిమా, తెలుగులో 'యుగానికి ఒక్కడు' పేరుతో విడుదలైంది.

అడవులు .. ఎడారులు .. ప్రాచీన రాజుల కాలంనాటి మూలాలు .. ఇలా ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2010లో వచ్చిన ఆ సినిమాకి సీక్వెల్ ను చేయడానికి సెల్వరాఘవన్ రంగంలోకి దిగాడు. విశేషమేమిటంటే ఈ సీక్వెల్ లో కార్తి కాకుండా ధనుశ్ కనిపించనున్నాడు.

ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన సెల్వరాఘవన్, గ్రాఫిక్స్ వారు చేయవలసిన పనిని కూడా వాళ్లకి అప్పగించేయడం జరిగిందని అంటున్నారు. విజువల్ వండర్ గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ కారణంగానే ఈ సినిమా కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంత ఆలస్యం అంటే .. 2024లో విడుదల చేసేంత అన్నమాట. ఇతర నటీనటుల .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ పూర్తికాగానే షూటింగు మొదలుపెడతారట.
Dhanush
Selva Raghavan
Karthi

More Telugu News