Akshay Kumar: ముందు జాగ్ర‌త్త‌గా.. క‌రోనాకు చికిత్స కోసం ఆసుప‌త్రిలో చేరాను: అక్ష‌య్ కుమార్‌

Actor Akshay Kumar says he has been hospitalised
  • నిన్న‌ ఉదయం క‌రోనా నిర్ధార‌ణ‌
  • వైద్యుల స‌ల‌హా మేరకు ఆసుప‌త్రికి హీరో
  • త్వ‌ర‌లోనే తిరిగి ఇంటికి వ‌స్తాన‌ని ట్వీట్
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు కరోనా సోకిన విష‌యం తెలిసిందే. నిన్న‌ ఉదయం క‌రోనా ప‌రీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. కరోనా నిబంధనల ప్ర‌కారం ఐసోలేషన్ లోకి వెళ్లానని, హోం క్వారంటైన్ లో ఉన్నాన‌ని నిన్న ఆయ‌న ట్వీట్ చేశాడు. అయితే, వైద్యుల స‌ల‌హా మేర‌కు ముందు జాగ్ర‌త్త‌గా ఆసుప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న‌ట్లు అక్ష‌య్ కుమార్ ఈ రోజు ట్వీట్ చేశాడు.

'నా కోసం మీరు చేస్తోన్న ప్రార్థ‌న‌లు ఫ‌లిస్తున్నట్లున్నాయి. మీ అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. నా ఆరోగ్యం బాగుంది. అయిన‌ప్ప‌టికీ, ముందు జాగ్ర‌త్త‌గా వైద్యుల స‌ల‌హా మేర‌కు ఆసుప‌త్రిలో చేరాను. త్వ‌ర‌లోనే తిరిగి ఇంటికి వ‌స్తాన‌ని భావిస్తున్నాను. జాగ్ర‌త్త‌గా ఉండండి' అని అక్ష‌య్ చెప్పాడు. కాగా, ప్ర‌స్తుతం ఆయ‌న ప‌లు సినిమాల్లో నటించాల్సి ఉంది. ఆయ‌న‌కు క‌రోనా సోక‌డంతో అవి వాయిదా ప‌డ్డాయి.  
Akshay Kumar
Bollywood
Corona Virus

More Telugu News